/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-13T152517.826-jpg.webp)
Ram Charan- Upasana: మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సంబరాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్ళికి హాజరు కాలేకపోయిన ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రెసెప్షన్ ఏర్పాటు చేయగా.. ఈ వేడుకలకు పలువురు సెలెబ్రెటీస్ హాజరై సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకల తరువాత మెగా ఫ్యామిలీ లో మరో పార్టీ హోస్ట్ చేశారు రామ్ చరణ్, ఉపాసన. దీపావళి సందర్భంగా సన్నిహితుల కోసం తన ఇంట్లో పార్టీనీ హోస్ట్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేసిన ఈ పార్టీలో పలువురు సెలెబ్రెటీస్, సన్నిహితులు పాల్గొన్నారు. జూనియర్ NTR, ప్రణతి దంపతులు, మహేష్ బాబు, నమ్రత దంపతులు, S.S కార్తికేయ ,S.S పూజ ప్రసాద్ దంపతులు, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి, మంచు లక్ష్మీ, విక్టరీ వెంకటేష్ పలువురు సెలెబ్రెటీ గెస్ట్ లతో కలిసి దీపావళి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఈ పార్టీకీ సంబంధించి మహేష్ బాబు వైఫ్ నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లో.. రామ్ చరణ్, ఉపాసన పార్టీనీ చాలా బాగా హోస్ట్ చేశారు. అందరితో కలిసి దీపావళిని సెలెబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతే కాదు ఆ పార్టీలోని కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. నమ్రత షేర్ చేసిన ఫొటోల్లో మహేష్ బాబు, రాంచరణ్, జూనియర్ NTR, విక్టరీ వెంకటేష్ కలిసి దిగిన ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. "4 లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్" అంటూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేసిన ఈ పార్టీలో తారక్, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
View this post on Instagram
Also Read: Nikhil: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!