TS Politics: బీఆర్ఎస్ గూటికి మరో కీలక నేత.. ఆ పదవి ఇస్తామని హామీ?

రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పెద్దలతో ఆయన టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఆయనకు హామీ లభించినట్లు సమాచారం.

New Update
TS Politics: బీఆర్ఎస్ గూటికి మరో కీలక నేత.. ఆ పదవి ఇస్తామని హామీ?

ఇతర పార్టీల్లో ప్రజాబలం ఉన్న నేతలను, గతంలో వివిధ కారణాలతో బీఆర్ఎస్ ను (BRS Party) వీడిన వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ. ఇప్పటికే చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి నేతలు ఈ నేపథ్యంలోనే పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (Somarapu Sathyanarayana) బీఆర్ఎస్ పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2014లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన చందర్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ గూటికి చేరిపోయారు. మరో సారి ఆయనకే టికెట్ కన్ఫామ్ కావడంతో సోమారపు పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
ఇది కూడా చదవండి: Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు

ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న సోమారపు సత్యనారాయణ

అయితే కొన్ని రోజుల క్రితం ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సోమారపు కోరగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ పెద్దల నుంచి ఆయనకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. దీంతో ఈ రోజు లేదా రేపు ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు