Ram Pothineni : త్వరలోనే నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని.. డైరెక్టర్ ఎవరంటే?

'డబుల్ ఇస్మార్ట్' తో ప్లాప్ అందుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

New Update
Ram Pothineni : త్వరలోనే నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని.. డైరెక్టర్ ఎవరంటే?

Ram Pothineni : ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' అట్టర్ ప్లాప్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రామ్ భారీగానే కష్టపడ్డాడు. మొదట తీసిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా 'డబుల్ఇస్మార్ట్' సక్సెస్ అవుతుందని ఆశించారు. కట్ చేస్తే.. సినిమా బెడిసి కొట్టింది.

నిజానికి రామ్ కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. 2019 లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నటించిన రెడ్ , వారియర్, స్కంద, రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ అన్నీ ప్లాప్ అయ్యాయి. వరుస అపజయాలు ఎదురైనా కూడా రామ్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి రూటు మార్చి తన స్టార్ ట్యాగ్ ను పక్కనపెట్టి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో చేతులు కలిపాడు.

Also Read : బిగ్ బాస్- 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటుగా మరొక చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు