PVR Multiplex: అయోధ్య వేడుకలు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లలో ప్రత్యక్షప్రసారం..!

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలో ప్రముఖ థియేటర్లు అయినటువంటి పీవీఆర్‌, ఐనాక్స్‌ లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి పాప్‌ కార్న్‌, కూల్‌ డ్రింక్‌ ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

PVR Multiplex: అయోధ్య వేడుకలు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లలో ప్రత్యక్షప్రసారం..!
New Update

Ayodhya: అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అంతా సిద్దమయ్యారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ప్రతి భక్తునికి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆంక్షలు, భద్రతా చర్యలు దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్ద నుంచే చూడాలని చాలా మంది నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఆ మహత్తర కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం (Live Programe) చేయనున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో (Theaters)  రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను లైవ్‌ ప్రసారం చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ థియేటర్లు అయినటువంటి పీవీఆర్(PVR), ఐనాక్స్‌ (INOX) లు మొత్తం 100 స్క్రీన్ల పై ఈ లైవ్‌ ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇందుకోసం రూ. 100 టికెట్‌ ను ప్రేక్షకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం లైవ్‌ ఉంటుందని థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మహోన్నత కార్యక్రమం చూసేందుకు వచ్చే భక్తులకు పాప్‌ కార్న్(PopCorn) , కూల్‌ డ్రింక్‌ లను ఉచితంగా అందిస్తామని థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.

అయోధ్య రామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఓ చారిత్రక ఘట్టమని పీవీఆర్‌ ఐనాక్స్ కో సీఈవో గౌతమ్‌ దత్తా అన్నారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద తెర పై ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. దేశంలోని 70 నగరాల్లో 170 కేంద్రాల్లో 100 స్క్రీన్ల పై ఈ ప్రసారాలు చేపట్టనున్నట్లు తెలిపాయి.

పెద్ద స్క్రీన్ల పై అయోధ్య వేడుకలను చూసేందుకు ఆ మల్టీప్లెక్స్‌ ల అధికారిక వెబ్‌ సైట్‌ లలో కానీ, బుక్‌ మై షో ద్వారా కానీ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

Also read: స్టాలిన్‌ చేయి పట్టుకుని నడిపించిన మోడీ!

#inox #pvr #ayodhya-ram-mandir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe