Ayodhya Ram lalla Idol: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!

అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం పై విష్ణుమూర్తి దశావతారాలు దర్శనం ఇస్తున్నాయి. వీటితో పాటు హనుమంతుల వారి రూపం కూడా స్వామి వారి విగ్రహం మీద చూడవచ్చు.

Ayodhya Ram lalla Idol: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!
New Update

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు మరో రెండు రోజుల్లో జరగనున్నవి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగక ముందే గర్భగుడిలోని బాలరాముని (Bal Ram) దివ్యరూపం భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం రాంలాలా పూర్తి చిత్రం బయటకు వచ్చింది. ఇందులో రాంలాలా తలపై కిరీటం, చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి. విగ్రహాన్ని పూలమాలలు, ఆభరణాలతో అలంకరించారు.

రాంలాలా విగ్రహం (Ram Lalla Idol) తొలిచూపులోనే రామభక్తులను ఆకర్షిస్తుంది. శ్రీరాముని నుదుటిపై పూసిన తిలకం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. విగ్రహంలో సూర్యుడు, ఓం, గణేష్, చక్రం, శంఖం, గదా, స్వస్తిక్‌, హనుమంతుని బొమ్మలు ఉన్నాయి. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ రాంలాలా విగ్రహాన్ని దివ్యంగా, గొప్పగా తీర్చిదిద్దారు.

51 అంగుళాలు..200 కిలోల బరువు..

రామ మందిరం గర్భగుడిలో ఉన్న రాంలాలా విగ్రహం అనేక గుణాలను కలిగి ఉంది. రాంలాలా విగ్రహం కాలి నుండి నుదుటి వరకు మొత్తం 51 అంగుళాలు ఉంటుంది. విగ్రహం బరువు దాదాపు 150 నుంచి 200 కిలోలు. విగ్రహం మీద కిరీటం అలంకరిస్తారు. శ్రీరాముని చేతులు మోకాళ్ల వరకు పొడవుగా ఉన్నాయి. తల అందంగా ఉంది. కళ్ళు పెద్దవిగా ఉన్నాయి.

దశావతారాలు..

విగ్రహం తామరపువ్వుపై నిలబడి ఉన్న భంగిమలో ఉంది. రాంలాలా చేతిలో విల్లు, బాణం ఉంది. 5 సంవత్సరాల పిల్లల చిన్నపిల్లల సున్నితత్వం విగ్రహంలో ప్రతిబింబిస్తుంది. ఈ విగ్రహంలో విష్ణువు  10 అవతారాలు కనిపిస్తాయి రాంలాలా విగ్రహంలో ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలుపుతూ కనిపిస్తుంది.

ఇది విష్ణువు 10 అవతారాలను వివరిస్తుంది - 1- మత్స్య, 2- కూర్మ, 3- వరాహ, 4- నరసింహ, 5- వామన్, 6- పరశురాముడు, 7- రాముడు, 8- కృష్ణుడు, 9- బుద్ధుడు, 10వ కల్కి అవతారం. అంతేకాకుండా, మొత్తం 10 అవతారాల బొమ్మలు కూడా రాంలాలా విగ్రహం మీద దర్శనం ఇస్తున్నాయి. విగ్రహం మీద హనుమాన్, గరుత్మంతుడి బొమ్మలు కూడా ఉన్నాయి.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం మూడు ఆచార్యుల బృందాలను ఏర్పాటు చేశారు. గర్భగుడిలో ప్రధాని మోడీ కూడా ఉంటారు. జనవరి 16న ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో నాలుగురోజులు పూర్తయ్యాయి.

విగ్రహం ఎత్తు 51 అంగుళాలు

విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. పుష్పాలతో విగ్రహం ఎత్తు 8 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం కృష్ణ రాయితో తయారు చేయడం జరిగింది. జనవరి 22న సంప్రోక్షణ అనంతరం జనవరి 23 నుంచి కొత్త ఆలయంలో భక్తులకు దర్శనం లభిస్తుంది.

గురువారం గర్భగుడిలో రాంలాలా ప్రతిష్టించబడినప్పుడు, విగ్రహం వస్త్రంతో కప్పి ఉంచారు. ఆ తర్వాత అర్థరాత్రి మరో చిత్రం బయటకు వచ్చింది, అందులో రాంలాలా విగ్రహంపై కళ్లకు గంతలు కట్టారు, జనవరి 22న పవిత్రోత్సవం సందర్భంగా ఈ కళ్లకు గంతలు తొలగిపోతాయి.

పాత విగ్రహాన్ని కొత్త ఆలయంలో ఉంచుతారు

ప్రస్తుతం తాత్కాలిక ఆలయంలో ఉన్న రాంలాలా విగ్రహాన్ని కూడా కొత్త ఆలయంలో అదే స్థలంలో ఉంచుతామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పూజ అనంతరం పాత విగ్రహాన్ని కొత్త ఆలయంలో ఉంచుతామని తెలిపారు. ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తర్వాత మాత్రమే ప్రజలు రెండు విగ్రహాలను పూజించగలరని వివరించారు. రెండు విగ్రహాలు గర్భగుడిలోనే ఉంటాయని సత్యేంద్ర దాస్ తెలిపారు.

Also read: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్‌ వో!

#ayodhya #ram-mandir #dasavatar #ram-lala-idol
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe