Ram Gopal Varma : అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా? ఆర్జీవీ మాస్ ర్యాగింగ్..

చంద్రబాబు అరెస్ట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు. బాబును పరోక్షంగా విమర్శించేలా ట్విట్టర్‌‌లో వరుస పోస్టులు పెడుతున్నారు. అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని పోస్ట్ చేసిన ట్విట్ పొలిటికల్ హిట్ ను పెంచుతోంది.

New Update
Ram Gopal Varma : అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా? ఆర్జీవీ మాస్ ర్యాగింగ్..

Ram Gopal Varma Twitter: చంద్రబాబు అరెస్ట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. బాబును డైరెక్ట్ సెటైర్స్ వేస్తూ మరింత పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఆర్జీవీ చేసిన ట్వీట్స్ పై వైసీపీ కేడర్ ఒకలా, టీడీపీ కేడర్ మరోలా స్పీందిస్తూ మోత మోగిస్తున్నారు. ఇంతకీ ఆర్జీవీ ఏం ట్వీట్ చేశాడో ఓసారి చూద్దాం..

అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని అని ట్వీట్ చేసిన ఆర్జీవీ... ఆయన అరెస్ట్ పై పెద్ద మ్యాథమెటికల్ థియరీ క్రియేట్ చేశారు. ఇలా ఉంది ఆయనగారి థియరి.. ”ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) ఖైదీ నంబర్ 7691. అంటే.. 7+6+9+1=23. ఇది ఆయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్ల సంఖ్య. ఇది నమ్మశక్యం కాని యాదృచ్ఛికం” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు.. దీని వెనక గ్రహాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.

‘మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా, నలభై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలేసినందుకు బంద్ కి పిలిస్తే, ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్ లు చేసుకున్నారా? అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని అని ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిన్న టీడీపీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్ ను ప్రజలు పట్టించుకోలేదని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ రామ్ గోపాల్ వర్మ 9 ప్రశ్నలను పవన్ కు సందించారు. వాటికి సింగిల్ వరల్డ్ లో సమాధానం చెప్పాలని వర్మ కోరారు.

” గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్, నా ఈ క్రింది 9 ప్రశ్నలకు( RGV 9 Questions ) కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్.

1.అసలు స్కిల్ స్కామ్( Skill Scam ) జరిగిందా లేదా ?

2.ఒకవేళ జరిగి ఉంటే సిబిఎన్ గారికి తెలియకుండా జరిగిందా ?

3.రూ 300 కోట్లు పైగా ప్రజాధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవకుండా, ఆఫీసర్స్ చెబుతున్న వినకుండా రిలీజ్ చేశారా లేదా ?

4.ఒకవేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ సీబీఎన్( CBN Skill Scam ) గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే, దానిమీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం కరెక్టా ?

5.ఎఫ్ ఐ ఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే.ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరు అయినా యాడ్ చేయవచ్చు అన్న విషయం మీకు తెలియదా ?

6.చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్లు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని నమ్మిన జడ్జిగారు బెయిల్ ఇవ్వకపోవడం తప్పా ?

7.సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాండ్ చేసిన జడ్జిగారు కరెప్టా

8.లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?

9.నా తొమ్మిదవ చివరి ప్రశ్న.అసలు స్కిల్ స్కాం కేసు మీకు అర్థమైందా .? దానిలోని తప్పులేంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా ? థ్యాంక్యూ అండి ” అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్( RGV Tweet ) చేశారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై, జైలుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దీన్ని ఖండించి బాబుకు మద్దతు ప్రకటించారు. మరికొందరు మాత్రం జగన్ ప్రభుత్వం చర్యలను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాబును పరోక్షంగా విమర్శించేలా ట్విట్టర్‌‌ లో వరుస పోస్టులు పెడుతున్నారు. తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు