VYOOHAM Song: 'వెన్నుపోటు రాజులు.. వెంటనడిచే కుక్కలు'.. RGV ట్రేడ్‌ మార్క్‌ 'వ్యూహం' సాంగ్‌!

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా 'వ్యూహం' నుంచి సాంగ్‌ విడుదల చేశారు మూవీ మేకర్స్‌. 'మా నాన్న వెంట కానీ.. వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూడలేదు' అని చంద్రబాబు భార్య ఆయనతో అనడం.. దానికి బదులుగా 'జనానికి పిచ్చి ముదిరింది' అని చంద్రబాబు అనడం లాంటి డైలాగులు పాటలో వినిపించాయి.'నరకాసుర నవ్వులు.. రాబంధుల హేళనలు' అంటూ సాంగ్‌ లిరిక్స్‌ ఉన్నాయి.

New Update
VYOOHAM Song: 'వెన్నుపోటు రాజులు.. వెంటనడిచే కుక్కలు'.. RGV ట్రేడ్‌ మార్క్‌ 'వ్యూహం' సాంగ్‌!

VYOOHAM Song : సెన్సెషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ(Ram gopal Varma) ఏం చేసినా అది జనాల్లోకి వెంటనే చొచ్చుకుపోతుంది. అది సినిమా కావొచ్చు.. సోషల్‌మీడియాలో పోస్ట్ కావొచ్చు.. ఆయన ఏం చేసినా అందులో అతని ట్రేడ్‌మార్క్‌ కంటెంట్ ఉంటుంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'వ్యూహం'. ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్‌ బయటకు వచ్చినా వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు సినీ లవర్స్‌ సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇవాళ దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి. ఈ సందర్భంగా ఆర్జీవీ 'వ్యూహం' నుంచి ఓ సాంగ్‌ని రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ సాంగ్‌ చూస్తున్న వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది.

'మా నాన్న వెంట కానీ.. వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూడలేదు' అని చంద్రబాబు భార్య ఆయనతో అనడం.. దానికి బదులుగా 'జనానికి పిచ్చి ముదిరింది' అని చంద్రబాబు అనడం లాంటి డైలాగులు పాటలో వినిపించాయి.. సీఎం జగన్‌ని చూడటానికి భారీగా వచ్చిన ప్రజలను సాంగ్‌లో చూపించారు. జగన్‌ని సీబీఐ దర్యాప్తు చేసిన సీన్‌ కూడా సాంగ్‌లో ఉంది. ఇక 'బురదజల్లే బంట్రోతులు' లిరిక్ వస్తున్నప్పుడు సోనియాగాంధీని సాంగ్‌లో చూపించడం ఆర్జీవీ స్టైల్‌కి అద్దం పడుతోంది. 'జనంతో అడుగేసే నాయకుడు జగన్‌' అని సాంగ్‌ లిరిక్స్‌లో ఉన్నాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ ఎర్రతుండు వేసుకోని కనిపించాడు. సాంగ్‌లో వైఎస్‌ భారతీని ఎక్కువ సేపు చూపించారు. జగన్‌, భారతీ మధ్య సీన్స్‌ని సాంగ్‌లో ఎక్కువ సేపు చూపించారు. 'నరకాసుర నవ్వులు.. రాబంధుల హేళనలు' అంటూ సాంగ్‌ లిరిక్స్‌ ఉన్నాయి.

రామదూత క్రియేషన్స్‌ పతాకంపై వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతీగా మానస నటిస్తున్నారు. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’.. వ్యూహం అంటూ క్యాప్షన్ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి..’’ అంటూ రామ్‌గోపాల్‌ వర్మ అని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

ALSO READ: ప్రముఖ నటుడు శివాజీ కన్నుమూత

Advertisment
తాజా కథనాలు