/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-25-jpg.webp)
Ram Charan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇటీవలే కూతురు క్లింకార, వైఫ్ ఉపాసనతో కలిసి వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చరణ్ ఫ్యామిలీ తో కలిసి మరో వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన థైలాండ్ వెకేషన్
థైలాండ్ లో భార్య ఉపాసన, కూతురు క్లింకార, పెంపుడు కుక్క రైమ్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన పెంపుడు కుక్క రైమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో రామ్ చరణ్ కూతురు క్లింకారతో కలిసి ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తూ సరదాగా కనిపించారు. అలాగే పెంపుడు కుక్క రైమ్ స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు 'వావ్ క్యూట్' కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
-
Also Read : Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!