Ram Charan : 'RC 16' కోసం రామ్ చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా?

బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.125 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో రామ్ చరణ్ కూడా చేరినట్లే అని చెప్పొచ్చు.

New Update
Ram Charan : 'RC 16' కోసం రామ్ చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా?

Ram Charan Remunaration For 'RC16' Movie : 'RRR' తో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడేళ్ళ నుంచి ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది.

కనీసం ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంపై దిల్ రాజు కూతురు క్లారిటీ ఇస్తూ.. ఈ ఏడాది అక్టోబర్ లో 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఉండొచ్చని చెప్పింది. కాగా ఈ సినిమాకి రామ్ చరణ్ 90 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read : నేను మోసపోయాను.. దయచేసి వాళ్ళ ట్రాప్ లో పడకండి, జగపతి బాబు సంచలన వీడియో!

బుచ్చిబాబు సినిమాకి రూ.125 కోట్లు

ఈ మూవీ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన 16 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.125 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో రామ్ చరణ్ కూడా చేరినట్లే అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు