/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-13.jpg)
Ram Charan - Niharika : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటేనే సెలెబ్రేషన్స్ కు పెట్టింది పేరు. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పండగొచ్చినా అందరూ ఒకే చోట కలిసి జరుపుకుంటారు.వీరి కుటుంబ సభ్యుల మధి ఉన్న అనుబంధం అందరికీ ఆదర్శం. నేడు (ఆగస్టు 19) రాఖీ పండగ కావడంతో మెగా ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read : ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త పాత్రలో ఆకట్టుకున్న రాజ్ తరుణ్
ఇందులో నాగబాబు కూతురు నిహారిక.. రామ్ చరణ్ కు రాఖీ కడుతుంది. రాఖీ కడుతూ మధ్యలోనే తనను దీవించమని చరణ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. దీంతో రామ్ చరణ్ నవ్వుతాడు. ఆ తర్వాత ‘హ్యాపీ రక్షాబంధన్’ అని సోదరిని దీవిస్తాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ నిహారికకు 'రక్షా బంధన్' విషెస్ తెలుపుతున్నారు.
View this post on Instagram
Follow Us