అబద్దాలు చెప్తే కాకి పొడుస్తుంది.ఆప్ మంత్రి పై బీజేపీ సెటైర్లు! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి తన్నింది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్లమెంట్ ఆవరణలో ఓ చోట నుంచుని ఫోన్ మాట్లాడుతున్న ఎంపీ రాఘవ్ పై ఒక్కసారిగా కాకి ఎటాక్ చేసింది. By Bhavana 26 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి తన్నింది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్లమెంట్ ఆవరణలో ఓ చోట నుంచుని ఫోన్ మాట్లాడుతున్న ఎంపీ రాఘవ్ పై ఒక్కసారిగా కాకి ఎటాక్ చేసింది. ఆయన తప్పించుకోవడానికి తలను కొంచెం కిందకి వంచినట్లు కూడా ఆ ఫోటోల్లో కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి బీజేపీ వారు సోషల్ మీడియాలో రాఘవ్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇన్ని రోజులు అబద్ధాలు చెబితే కాకి పొడుస్తుందనే సామెతను విన్నాము కానీ..ఇప్పుడు చూస్తున్నాము అంటూ సామెతను జోడించింది. '' జూట్ బోలే కవ్వా కాటే'' అంటూ క్యాప్షన్లు ఇచ్చింది. ఇక బీజేపీ ఎంపీ తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆ ఫోటోపై ఓ సెటైర్ వేశారు. కాకి అటాక్ ఫోటోను చూసి తన గుండె తరుక్కుపోయిందని, బహుశా ఎంపీగారి ఆరోగ్యం బాగుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్ లో చెలరేగుతున్న అల్లర్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ ఫోటోలను లింక్ చేస్తున్నారు. మణిపూర్ లో జరుగుతున్న దౌర్జన్యాలకు బీజేపీ దాచిపెట్టాలనుకుంటోందని రాఘవ్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు రాఘవ్ ట్వీట్ చేశారు. #delhio #crow-attack #aap-mp-raghav #delhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి