Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. లోకేష్‌కి ఫోన్ చేసిన రజనీకాంత్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు.

New Update
Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. లోకేష్‌కి ఫోన్ చేసిన రజనీకాంత్

Rajinikanth: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు. యువనేత నారా లోకేష్‌కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్న ప్రముఖులు..

ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మరో నిర్మాత నట్టికుమార్ ప్రకటనలు చేశారు. అలాగే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాద్ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.

రాజకీయాలకు ఆతీతంగా మంచి స్నేహం..

చంద్రబాబు, రజనీకి తొలి నుంచి రాజకీయాలకు ఆతీతంగా మంచి స్నేహం ఉంది. ఇటీవల ఎన్టీఆర్ శత దినోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన సభకు తలైవా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో చంద్రబాబును పొగడుతూ రజనీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. రజినీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై రజనీకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. వీటిపై మండిపడిన రజనీకాంత్ అభిమానులు.. సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.. అలాగే తమ హీరో రజనీకి క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా రజనీకాంత్ కు ఫోన్ చేసి వైసీపీ నేతల మాటలను పట్టించుకోవొద్దని కోరారు.

బాబును జైల్లో కలవనున్న పవన్..

మరోవైపు రేపు(సెప్టెంబర్ 14) రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఇండియా కూటమిలో చేరుతారా..? బీజేపీని ఢీ కొడతారా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు