BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!

బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగలనుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన.. రేపు కాంగ్రెస్‌లో చేరతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

New Update
BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!

MLA Prakash Goud: లోకసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగలనుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్‌ గౌడ్‌.. రేపు కాంగ్రెస్‌లో చేరతానని రేవంత్‌కు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ

కాగా, ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలంట్ గా పార్టీ నుండి బయటకి వస్తున్నారు. అధికార పార్టీ కండువ కప్పుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు