పార్టీ మార్పుపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై స్వామి వారి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ గురువు అని అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలని నిరంతరం ఆలోచిస్తారని అన్నారు ప్రకాశ్ గౌడ్.
పూర్తిగా చదవండి..BRS MLA Prakash Goud: నా రాజకీయ గురువు చంద్రబాబు.. పార్టీ మార్పుపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన ప్రకటన!
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రకటించారు. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ గురువు చంద్రబాబు మరోసారి సీఎం కావడం సంతోషంగా ఉందన్నారు.
Translate this News: