/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rajasthan-1-jpg.webp)
రాజస్థాన్‌కు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కారు ప్రమాదానికి గురైంది. భజన్ లాల్ ఉత్తరప్రదేశ్ లోని మధురలోని గోవర్ధన్‌లో ఉన్న గిర్రాజ్ దాన్ వ్యాలీ ఆలయాన్ని దర్శించుకునేందుకు అక్కడి వెళ్లారు.ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి...తిరుగు ప్రయాణంలో కారు అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది.దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ ఘటనలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయనను మరో కారులో గోవర్ధన్ కు చేరుకున్నారు. డ్రైనేజీలోకి దూసుకుపోయిన సీఎం కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భజన్ లాల్ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రికార్డు సృష్టించడం గమనార్హం. తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఆయన కంటే ముందు ఉన్న నాయకులందరూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టక ముందు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో సీఎం అయిన మూడో బీజేపీ నేత భజన్ లాల్ శర్మ.
ఇంతకు ముందు రాజస్థాన్‌లో బీజేపీ నుంచి భైరో సింగ్ షెకావత్, వసుంధర రాజే సీఎంలుగా ఉన్నారు. భజన్ లాల్ శర్మ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భాజన్ లాల్ శర్మ బిజెపికి చెందిన నలుగురు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ పర్నామి, మదన్‌లాల్ సైనీ, సతీష్ పూనియా, సిపి జోషి ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
BREAKING : Rajasthan CM Bhajan Lal Sharma met with an accident while heading towards Giriraj Ji in Uttar Pradesh.
The incident occurred as the car veered off the road and fell into a drain upon entering Poochhri. Despite the mishap, Chief Minister Bhajan Lal Sharma emerged from… pic.twitter.com/1HELQOFQSt
— The New Indian (@TheNewIndian_in) December 19, 2023
Rajasthan Chief Minister Bhajan Lal Sharma's car met with an accident, CM was sent by another vehicle, he is escaped unhurt.#RajasthanCM #BhajanlalSharma #Accident #Mathura pic.twitter.com/LIEdMaaaSX
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 19, 2023
ఇది కూడా చదవండి: ఢీ కొడతారా!.. డీలా పడతారా!.. మోదీ, షా ద్వయాన్ని ఖర్గే నిలువరిస్తారా!