/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dhanuja-jpg.webp)
Danuja Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా(rajanna sircilla) మరిగడ్డలో విషాదం చోటుచేసుకుంది. ధనుజ(Danuja) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చందుర్తి మండలం మరిగడలో రెండు నెలలుగా..పోస్ట్‌మెన్‌గా పని చేస్తున్న ధనుజ సూసైడ్ చేసుకోవడంతో సంచలనంగా మారింది. అయితే, ధనుజ ఆత్మహత్యతో ప్రియుడు రాకేష్(rakesh)పై స్ధానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రాకేష్‌తో ధనుజకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..ధనూజ తరచూ ఫోన్‌లో బిజీగా ఉండేదని స్థానికులు తెలుపుతున్నారు.
అయితే,మరోవైపు ఆమె ప్రియుడు రాకేష్ ధనుజ మృతిపై RTVతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడాడు. పోస్ట్ ఆఫీస్‌లోని అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ధనుజ పలుమార్లు తెలిపిందని అన్నాడు. దీంతో ఆఫీస్‌కు రిజైన్ చేయమని తానే సూచించానని కూడా తెలిపాడు. గత ఆగస్టు నెల 31న ధనుజ రిజైన్ చేసినట్లు తెలిపాడు. అయితే తాను రిజైన్ చేసినప్పట్టికీ మరిగడలోని పోస్ట్ ఆఫీస్ అధికారులు తనను కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని..లేదంటే చర్యలు తీసుకుంటామని ఆమెను బెదిరించారని తెలిపాడు.
కేవలం అధికారుల వేధింపుల వల్లే ధనుజ ఆత్మహత్య చేసుకుందంటూ రాకేష్ ఆరోపిస్తున్నారు. సూసైడ్ చేసుకునే ముందు కూడా ధనుజ తనతో ఫోన్ మాట్లాడిందని..అయితే తాను ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేకపోయానని తెలిపాడు.డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న ధనుజ తన తల్లిదండ్రులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో పోస్ట్‌మెన్‌గా రెండు నెలలు విధులు నిర్వహిస్తుండేదని..అయితే ఆఫీస్‌లో తాను ఒక్కతే యువతి కావడంతో వెళ్లడానికి భయపడేదని తన ప్రియుడు రాకేష్ తెలిపాడు.కూతురు ధనుజ మృతిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో యువతి, యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మార్క్స్ మంచిగా రాలేదని, తల్లిదండ్రలు తిట్టారని, ఆఫీస్‌లో ఒత్తిడి ఎక్కువ అవుతుందని, ప్రేమ విఫలం అయిందని.. ఇలా రకరకాల కారణాలతో యువతి, యువకుల సూసైడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.