Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు.. కారణమిదే!

ప్రముఖ సినీ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి ఏపీలోని రాజమండ్రి కోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన విషయంపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు.. కారణమిదే!
New Update

ప్రముఖ సినీ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి (Posani Krishna Murali) ఏపీలోని రాజమండ్రి కోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్‌ పై (Pawan Kalyan) ఆయన అనుచిత వాఖ్యలు చేశారని జనసేన పార్టీ నేతలు (Janasena Party Leaders) రాజమహేంద్రవరం పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ పై స్పందించడం లేదని, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి పై IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాజమండ్రి పోలీసులు.

ఇది కూడా చదవండి: Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..

పోసాని కృష్ణ మురళి నిన్న కూడా మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి, బ్రహ్మణి టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. భర్త, కొడుకు నాశనం కావటానికి ప్రధాన కారణం భువనేశ్వరేనంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని. అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

ఇది కూడా చదవండి: Atma Sakshi Survey: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!

చంద్రబాబును జైలుకు పంపింది జగన్ ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని. అలా పంపించాలనుకుంటే నాలుగేళ్ల ముందే పంపించే వారు కదా అని అన్నారు. ఒక్కపుడు చంద్రబాబు, లోకేష్ ను తిట్టిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడంటూ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్‌ తో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారంటూ పోసాని ధ్వజమెత్తారు.

#ap-police #posani-krishna-murali
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe