Rajaiah: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ను కలవడానికి హైదరాబాద్ వెళ్లానని.. అక్కడ కడియం శ్రీహరి కూడా ఉండటంతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అంతే తప్ప కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునన్నారు. ఒకవేళ బీఫామ్ రాకపోతే తన రాజకీయ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Translate this News: