Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

New Update
Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ను కలవడానికి హైదరాబాద్ వెళ్లానని.. అక్కడ కడియం శ్రీహరి కూడా ఉండటంతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అంతే తప్ప కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునన్నారు. ఒకవేళ బీఫామ్ రాకపోతే తన రాజకీయ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.

కొన్నాళ్లుగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరిని తమ అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్రకటించడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. అయితే శనివారం కేటీఆర్ సమక్షంలో రాజయ్య,  కడియం కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారనే వార్తలు జోరుగా వచ్చాయి.  పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రాజయ్య వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పందించిన రాజయ్య అలాంటిది ఏం లేదని కొట్టిపారేశారు. దీంతో కథ మళ్లీ మొదటకే వచ్చినట్లు అయింది.

కాగా తొలి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు తాటికొడం రాజయ్య. ఈ క్రమంలోనే  జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం రాజయ్యను బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. నవ్య ఎపిసోడ్ రచ్చ.. రచ్చ కావడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆయన వైపే మొగ్గు చూపింది.

ఇది కూడా చదవండి: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

Advertisment
తాజా కథనాలు