Chandrababu: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషయల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేశారు అధికారులు. బాబు ఆరోగ్య పరిస్థితిపై 4వ రోజులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు సెంట్రల్ జైల్ ఇన్‌చార్జి సూపరింటెండ్ రాజ్ కుమార్. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జైలులో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.

Breaking: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
New Update

Chandrababu Health Bulletin: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషయల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేశారు అధికారులు. బాబు ఆరోగ్య పరిస్థితిపై 4వ రోజులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు సెంట్రల్ జైల్ ఇన్‌చార్జి సూపరింటెండ్ రాజ్ కుమార్. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జైలులో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన హెల్త్ రిపోర్ట్ ఇలా ఉన్నాయి..

బీ పీ 140/80
పల్స్..70/మినిట్
రెస్పిరేటరీ రేటు.. 12/మినిట్
ఎస్ పీ ఓటు.. 96శాతం
వెయిట్..67కేజీలు
ఫిజికల్ యాక్టివిటీ.. గుడ్

టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ..

ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జనసేనతో సమన్వయం కోసం టీడీపీ ఆదివారం నాడు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. ఈ రెండు కమిటీల పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వంపై పోరాటాలు వంటి విషయాల్లో కలిసి వెళ్లేలా కేడర్‌ను సమన్వయం చేసుకోనున్నాయి. 

“న్యాయానికి సంకెళ్లు” పేరుతో టీడీపీ నిరసన..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి దాదాపుగా రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) ఢిల్లీలో ఉంటూ న్యాయవాదులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. నిన్న రాజమండ్రికి వచ్చిన నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ రోజు రాజమండ్రి నుంచి నారా లోకేష్, బ్రాహ్మణి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు సాయంత్రం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్ జరిగిన నాటి నుంచి వివిధ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది టీడీపీ. తాజాగా నారా లోకేష్ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు “న్యాయానికి సంకెళ్లు” నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ”చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో నిరసన తెలియజేయండి. చేతులకు తాడు, రిబ్బన్, ఏదైనా గుడ్డతో సంకెళ్లులా కట్టుకొని నిరసన తెలియజేయండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయండి. అక్రమ నిర్బంధంలో ఉన్న చంద్రబాబు గారికి మద్దతుగా నిలవండి.” అని ట్విట్టర్ లో కోరారు నారా లోకేష్

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe