TS assembly elections: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన

New Update
TS assembly elections: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన

ఎన్నికల రణరంగానికి కాషాయసేన సిద్ధమౌతోంది. నేతలకు పని విభజనపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది. బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులు. ఈ మీటింగ్‌లో జవదేకర్, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ప్రచార కమిటీ పగ్గాలపై కీలక చర్చ జరిగింది. ప్రచార కమిటీ రేసులో డీకే అరుణ,రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అటు ప్రచార కమిటీ బాధ్యతలు ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఇటీవలే యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు రాజగోపాల్ రెడ్డి. మేనిఫెస్టో కమిటీ బాధ్యతలకు వివేక్ పేరు పరిశీలించారు. మిగతా కమిటీలపై చర్చ కొనసాగుతోంది.

నిజానికి కొంతకాలంగా బీజేపీకి సీనియర్లు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ నుంచి కాషాయ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్‌.. అటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేతలు కూడా ఇప్పుడు పార్టీలో దూకుడు లేకపోవడంతో పార్టీలో ఇంటర్నెల్‌గా నిరాశ నెలకొని ఉంది. వాటికి చెక్ పెట్టేందుకు బీజేపీ హైకమాండ్‌ ప్లాన్లు వేసింది. ప్రతిఒక్కరూ శాటిస్‌ఫై అయ్యేలా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించనుంది.

తెలంగాణలో అభ్యర్థులను ఇంకా నిర్ణయించని బీజేపీ:
మరోవైపు తెలంగాణ నుంచి బీజేపీ తరుఫున టికెట్ ఆశిస్తున్న వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరో రెండు రోజులు ఈ అప్లికేషన్‌ మోడ్ ఆన్‌లో ఉంటుంది. సెప్టెంబర్ 10 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. చివరి తేదీ తర్వాత దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలన అనంతరం అభ్యర్థులను జాతీయ స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తామని, తేదీని పేర్కొనకుండానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. గత నాలుగు రోజుల్లో దాదాపు 800 మంది అభ్యర్థులు బీజేపీ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు పార్టీ టిక్కెట్ల కోసం సీనియర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపు రావుతో సహా సీనియర్లందరినీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. ఇప్పటి వరకు ఎవరూ తమ దరఖాస్తులను సమర్పించలేదు.

ALSO READ: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు