Raj Tarun: వేరే అమ్మాయితో కూడా.. రాజ్ తరుణ్ రాసలీలలు బయటపెట్టిన లావణ్య..!

హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న లావణ్య షాకింగ్ నిజాలు బయటపెట్టింది. తనతో రాజ్ తరుణ్ కు పెళ్లి కూడా అయ్యిందని. మాల్వి కంటే ముందు కూడా అతనికి వేరే అమ్మాయిలతో సంబంధం ఉందని తెలిపింది.

New Update
Raj Tarun: వేరే అమ్మాయితో కూడా..  రాజ్ తరుణ్ రాసలీలలు బయటపెట్టిన లావణ్య..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతని లవర్ లావణ్య తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీనికి కారణం నటి మాల్వి మల్హోత్రా అంటూ ఆరోపణలు కూడా చేసింది లావణ్య. ఇక దీని పై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలనీ, ఒకప్పుడు తాము రిలేషన్ లో ఉన్నామని. కానీ ఇప్పుడు తనతో ఎటువంటి సంబంధం లేదని మీడియా వేదికగా చెప్పాడు.

ఆర్టీవీతో రాజ్ తరుణ్ లవర్ లావణ్య షాకింగ్ నిజాలు

ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న లావణ్య ఆమె ప్రియుడు రాజ్ తరుణ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. లావణ్య ఆర్టీవీతో మాట్లాడుతూ.. "హీరో కాకముందు నుంచే తనకు రాజ్ తరుణ్ తో పరిచయం ఏర్పడిందని. గతేడాది అక్టోబర్ లో వారిద్దరూ గచ్చిబౌలి ఎల్లమ్మ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని. మాల్వి పరిచయం అయినప్పటి నుంచే తనకు రాజ్ కు మధ్య దూరం ఏర్పడిందని. గతంలో కూడా వేరే అమ్మాయిల విషయంలో రాజ్ కు నాకు గొడవ జరిగేదని. మాల్వి కంటే ముందు కూడా తనకు వేరే అమ్మాయిలతో సంబంధం ఉందని షాకింగ్ విషయాలు బయట పెట్టింది." పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింది వీడియోను చూడండి. 

Also Read: Salman Khan: "హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్".. సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెష్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు