Telangana: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 10 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ అధికారులు తెలిపారు.

మహదేవ్‌పురం, మచ్చబొల్లారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 30.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

Also read: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్

Advertisment
తాజా కథనాలు