AP Rains: ఏపీలో దంచికొడుతున్న వర్షం.. ఆదోళనలో రైతులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, రావులపాలెంలో ఉరుములు మెరుపులు, సుడిగాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. By Vijaya Nimma 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం రోజున ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెళ్లడించారు. ఉమ్మడి విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, రావులపాలెంలో ఉరుములు మెరుపులు, సుడిగాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది. గంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నారు. సుడిగాలిలతో కూడిన వర్షం కావడంతో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లో అవకాశం ఉందని రైతులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. కాగా.. ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: బగ్లాముఖి జయంతి రోజు ఇలా చేయండి.. అంత శుభమే #ap-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి