వానలు తగ్గాయని ఇలా అనుకున్నామో లేదో.. ఇంతలోనే వాతావరణశాఖ మరో బాంబు పేల్చింది.. రేపు(జులై 25), ఎల్లుండి(జూలై25) తెలుగు రాష్ట్రాలపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించనున్నాడు. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఈరోజు(జులై 24) సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ (orange alert) జారీ చేశారు అధికారులు. రానున్న రెండు రోజులు కోస్తా (coastal), రాయలసీమ (rayalaseema)కు భారీ నుంచి అతి భారీవర్షాల ముప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్(AP)లో గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశముంది. ఈనెల 27 వరకు చేపల వేటకు వెళ్లద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ద్రోణి ఎఫెక్ట్:
ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. దక్షిణ ఒడిశా (odisha) మీదుగా ద్రోణి విస్తరించింది. వీటికి తోడుగా తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా రానున్న రెండు రోజులు(జులై 25, జులై 26) అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
పొంగిపొర్లుతున్న వైనతేయా నదులు:
మరోవైపు కోనసీమ (konaseema) జిల్లాలో గోదావరి (godavari) వరద నిలకడగా ఉంది. వైనతేయా, వశిష్ట, గౌతమి ,వృద్దగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 11.4(జులై 27 మధ్యాహ్నం సమయానికి)అడుగులుగా ఉంది. బ్యారేజ్ నుంచి 8 లక్షల 98 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు పి.గన్నవరం మండలం చకలిపాలెం, కనకాయలంక, అయినవిల్లి మండలం ఎదురు బిడియం కాజ్ వే ల పైకి నాలుగు రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలు కాజ్ వేలపై వరద ప్రవాహం లొనే ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు . చాకలిపాలెం - కనకాయలంక వరద ప్రవాహానికి కాజ్వే మునిగిపోవడంతో నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు ఇరు జిల్లాల ప్రజలు. వరద తాకిడికి కోనసీమలో లంక భూములు ఏక్కడికక్కడ కోతకు గురౌతున్నాయి. అప్పన పాలెం,బడుగువాని లంక,కొండుకుదురు లంక గ్రామాలలో గోదావరి తీరం కోతకు గురైంది. ఇక జిల్లాలో రాత్రి నుంచి కొన్ని ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది.