Rain Alert for Telugu states: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక!

ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 2.1మీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఉండగా.. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురుస్తాయి. తీరం వెంబడి 45-55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

New Update
Rain Alert for Telugu states: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక!

Rain Alert for Telugu states: రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌లో భారీ వర్షం పడింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ జంట నగరాలతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఐతే మరో మూడ్రోజుల వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి!
పంటల సాగుకు మేలు:
ఐదు వారాల విరామం తర్వాత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి వరదనీరు వచ్చి చేరుతోంది. గురువారం బ్యారేజీకి 22 వేల క్యూసెక్కుల నీరు రావడంతో నీటిపారుదల శాఖ అధికారులు 17 గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. రాష్ట్రంలో డ్రై స్పెల్ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లకు వరదనీరు వచ్చి చేరడంతో పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ, పులిచింతల రిజర్వాయర్ల మధ్య నిల్వ సౌకర్యం లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరదనీరు సముద్రంలోకి వదులుతోంది. జలవనరుల శాఖ ప్రకారం, జూన్ 2023లో ప్రారంభమయ్యే ఈ వర్షాకాలంలో 58 టీఎంసీ అడుగుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న రిజర్వాయర్ నిర్మాణం నీటి నిల్వకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3 టీఎంసీ అడుగుల మాత్రమే. ప్రకాశం బ్యారేజీ ద్వారా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న 14 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు నీరు అందుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న కృష్ణానది నీటిని దశలవారీగా ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయడం వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగు నీరు అందుతుంది.

రెండు రోజులు వర్షాలు:
రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ(సెప్టెంబర్ 8) పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-మచిలీపట్నం, అనకాపల్లి, అల్లూరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ALSO READ: విషాద ఘటన.. మృతదేహంతో వాగు దాటిన గ్రామస్తులు

Advertisment
తాజా కథనాలు