Railway Board: రైల్వే ప్రమాద బాధితులకు పరిహారం పది రెట్లు పెంపు!

రైలు ప్రమాదాల్లో (Train Accidents) ప్రాణాలు కోల్పొయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు (Railway Board) ప్రకటించింది.

New Update
Railway Board: రైల్వే ప్రమాద బాధితులకు పరిహారం పది రెట్లు పెంపు!

రైలు ప్రమాదాల్లో (Train Accidents) ప్రాణాలు కోల్పొయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు (Railway Board) ప్రకటించింది. దీని గురించి సెప్టెంబర్‌ 18 నే ఉత్తర్వులు జారీ చేయగా..అప్పటి నుంచి పరిహారం పెంపు అనేది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పరిహారాలు అనేది చివరిసారిగా 2013 లో పెంచారు.

అయితే ఈ పరిహారం అనేది కేవలం రైలు ప్రమాదాల్లో బాధితులకు మాత్రమే కాదు..రైల్వే గేట్ల వద్ద కాపలాదారులున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్లు వద్ద జరిగే ప్రమాద బాధితులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. లెవెల్ క్రాసింగ్‌ గేట్లు వద్దు జరుగుతున్న ప్రమాదాల్లో ఇప్పటి వరకు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారికి ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు 50 వేల పరిహారాన్ని అందిస్తుండగా..ఇక పై వారికి 5 లక్షలు ఇస్తారని రైల్వే బోర్డు తెలిపింది.

రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఇప్పటి వరకు రూ.25 వేలు ఇస్తుండగా వారికి ఇక పై రూ.2.5 లక్షలు అందిచనున్నారు. స్వల్ప గాయాలైన వారికి రూ.5 వేలు ఇస్తుండగా వారికి ఇక మీదుట రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ పరిహారాలు రూ.1.50 లక్షల నుంచి రూ. 50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు.

ఇదిలా ఉంటే రైలు ప్రమాద బాధితులు..30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే వారికి రోజుకి 3 వేల నుంచి 10 రోజులకోసారి అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇలా 6 నెలల వరకు ఇచ్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక తరువాత నుంచి రూ. 750 చొప్పున మరో 5 నెలల పాటు ఇచ్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది.

అయితే ఈ ఎక్స్‌గ్రేషియా అనేది కేవలం కాపలాదారులు ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్లు వద్ద జరిగే ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కాపలాదారులు లేని లెవెల్‌ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు రైల్వే నిబంధనలను అతిక్రమించిన వారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ వల్ల విద్యుదాఘాతానికి గురైన వారికి మాత్రం ఈ పరిహారం లభించదని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు