IRCTR: అదంతా తప్పుడు ప్రచారం.. ఈ-టికెట్ల బుకింగ్‌పై రైల్వేశాఖ క్లారిటీ!

ఐఆర్‌సీటీసీ అకౌంట్ నుంచి ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష, జరిమానా పడుతుందంటూ ప్రచారమవుతున్న వార్తలను రైల్వేశాఖ కొట్టిపారేసింది. అదంతా ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రజలను తప్పదోవపట్టించేందుకు ఇలా చేస్తుంటారని, ఎవరూ ఇవి నమ్మొద్దని సూచించింది.

New Update
IRCTR: అదంతా తప్పుడు ప్రచారం.. ఈ-టికెట్ల బుకింగ్‌పై రైల్వేశాఖ క్లారిటీ!

Railway: కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ కు ఐఆర్‌సీటీసీ (IRCTR)లో వ్యక్తిగత ఖాతాల ద్వారా టికెట్స్ బుక్ చేస్తే జైలుపాలవుతారంటూ ప్రచారమవుతున్న వార్తలపై రైల్వేశాఖ స్పందించింది. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్‌ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా అంటూ వెలువడుతున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ప్రజలను తప్పదోవపట్టించేందుకు ఇలాంటి తప్పుడు న్యూస్ క్రియేట్ చేస్తున్నారని, ఎవరూ ఇవి నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.

ఈ మేరకు పర్సనల్‌ యూజర్‌ ఐడీతో ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్స్‌ ఎవరికైనా ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. 'ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు పొందొచ్చు. ఆధార్‌ లింక్ చేసుకున్నవారు నెలలో 24 టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అయితే పర్సలన్ ఐడీలతో బుక్‌ చేసిన ఈ-టికెట్లు వాణిజ్యపరమైన సెల్స్ కోసం ఉద్దేశించినవికావు. అలాంటి చర్యలకు పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్‌ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తాం' అంటూ రైల్వే మంత్రిత్వశాఖ ‘ఎక్స్‌’ వేదికగా వివరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు