మణిపూర్ సాక్షిగా బీజేపీ భరతమాతను హత్య చేసింది : లోక్ సభలో రాహుల్

లోక్‌సభలో ఈరోజు వరుసగా రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రాహుల్ మాట్లాడతారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ప్రభుత్వం తరపున అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ చర్చలో పాల్గొని తమ పక్షాన నిలబడవచ్చు. అంతకుముందు, చర్చ మొదటి రోజు అంటే మంగళవారం, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు.

New Update
మణిపూర్ సాక్షిగా బీజేపీ భరతమాతను హత్య చేసింది : లోక్ సభలో రాహుల్

Rahul Gandhi speaks  on No Confidence Motion:

మణిపూర్ సాక్షిగా బీజేపీ భరతమాతను హత్య చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన ప్రసంగించారు.    తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు లోక్ సభ స్పీకరు ఓం బిర్లాకు ధన్యవాదాలు చెప్పారు.  ఆ తర్వాత వెంటనే ఆయన అదానీ అంశాన్ని ఎంచుకున్నారు. '' గత సమావేశాల్లో నేను అదానీ పేరు ప్రస్తావించి మీ నాయకుడి మనసును గాయపరిచాను.   మీ అందరూ  కూడా వేదనకు గురయి ఉంటారు . అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను.  కానీ నేను నిజమే మాట్లాడాను. బీజేపీ మిత్రులు కలవరపడవలసిన పనిలేదు. నేను ఇప్పుడు అదానీ గురించి మాట్లాడబోవటం లేదు" అని పేర్కొన్నారు.

లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అనంతరం,  రాహుల్ ఏం మాట్లాడతారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు కూడా చర్చ జరగనుంది. ఈరోజు కూడా విపక్షాలు, అధికార పక్షాల మధ్య వాడీవేడీ చర్చ సాగనుంది.  మణిపూర్ అంశంపై మోదీ ప్రభుత్వం (Modi Govt)పై విరుచుకుపడనున్నారు.   అదే సమయంలో ప్రభుత్వం తరపున అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీలు చర్చకు దిగడం ద్వారా విపక్షాలకు సమాధానం చెప్పవచ్చు.

కాంగ్రెస్ ఎంపీల విసుర్లు

బీజేపీ దేశం గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. బీజేపీ సమాజం గురించి, మణిపూర్ గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీని, ఆయన కుటుంబాన్ని ఎలా దూషించాలో బీజేపీ నేతలకు మాత్రమే తెలుసు అన్నారు. మోదీ ప్రభుత్వ ప్రతినిధులందరూ రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

చర్చ ప్రారంభమైన తొలిరోజు కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌన దీక్షను భగ్నం చేసేందుకు బలవంతంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చామని గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడాక.. ప్రధానీ మోదీ స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు అనర్హత వేటు వల్ల లోకసభకు దూరంగా ఉన్న రాహుల్ గాంధీ నాలుగు నెలల తర్వాత లోకసభకు రావడం కాంగ్రెస్ వర్గాల్లోనూ, ప్రతిపక్షాల్లోనూ ఆనందం కనిపించింది.

అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే ఇండియా కూటమికి 272 ఓట్లు రావాలి. అయితే బీజేపీకి సొంతంగా 301ఓట్లు ఉండగా, అవిశ్వాస తీర్మానం అనవసరం అనే అభిప్రాయం కూడా ఉంది. ఎన్డీఏ ముందు అవిశ్వాస తీర్మానం నిలవదని తెలిసినా సరే, విపక్షాల ఐక్యతను చాటాలన్న బలమైన ఆకాంక్షతో పాటు  మణిపూర్ ఘటనపై స్పందించాలన్న ఉద్దేశ్యంతో ఇండియా కూటమి ఇందుకు సిద్ధమైంది.  అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోదీ సభకు గైర్హాజరు  కానున్నారు.

Also Read: ఆయుష్మాన్ భారత్ పథకంపై కాగ్ షాకింగ్ రిపోర్టు.. ఒకే నెంబర్‎పై లక్షల రిజిస్ట్రేషన్లు..!!

Advertisment
తాజా కథనాలు