Emergency landing: సోనియా, రాహుల్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశం అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీ తిరిగి పయనమయ్యారు. అయితే వారు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది భోపాల్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

New Update
Emergency landing: సోనియా, రాహుల్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

publive-image

విమానంలో సాంకేతిక లోపం..

బెంగళూరు నుంచి ప్రత్యేక ఛార్టర్ట్ ఫ్లైట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరారు. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన సిబ్బంది భోపాల్‌లోని రాజాభోజ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే భోపాల్‌లో కూడా వాతారణం అనుకూలించకపోవడంతో విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వేచి ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి పయనమవుతారని అధికారులు చెబుతున్నారు. అయితే మరికాసేపట్లో ఇండిగో విమానంలో ఇద్దరూ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది.

బెంగళూరులో విపక్షాల భేటీ..

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బెంగళూరులో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. విపక్షాల సమావేశంలో సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇకపై కూటమి పేరు I-N-D-I-A..

ఇప్పటివరకు విపక్షాల కూటమి పేరు UPA(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్)గా ఉండగా.. తాజాగా దాని స్థానంలో I-N-D-I-A(ఇండియా నేషనల్ డెవలెప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పోరాటం దేశం కోసం అన్నారు. అందుకే తాము ఇండియా కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. త్వరలోనే తమ తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు