గత ఏడాది మణిపూర్‌లో మైతేయ్, కుకి తెగల మధ్య ఘర్షణ అల్లకల్లోలంగా మారింది.ఈ ఘర్షణలో చాలా మంది చనిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఈరోజు మణిపూర్ కి వెళ్లారు. రాజధాని ఇంఫాల్‌లోని జిరిబామ్ సహాయ శిబిరాన్ని సందర్శించిన రాహుల్ ప్రజలను కలిశారు.
ఈ సందర్భంగా అక్కడి అల్లర్ల బాధితులతో ఆయన సమావేశమై మాట్లాడారు. అనంతరం గవర్నర్ అనూష్య ఉయ్గీని కలిశారు.
అనంతరం మీడియా సమావేసంలో రాహుల్ మాట్లాడుతూ, నేను గవర్నర్‌ను కలిశాను. మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ శాంతి కలగాలని నా కోరిక. అందుకోసం ప్రయత్నిస్తానని చెప్పానని.. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని రాహుల్ తెలిపారు.