Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు.రానున్న ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు. తాను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి రాలేదన్న రాహుల్..ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చానని వెల్లడించారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించామన్నారు.
Also Read: మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!!
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని వెల్లడించారు. పసుపు రైతులకు క్వింటాకు రూ.12వేలు ధర కల్పిస్తామని ప్కేర్కొన్నారు. గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాహుల్ వ్యాఖ్యనించారు. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న డబ్బునే సంక్షేమం రూపంలో మీకు పంచనున్నమన్నారు.
తెలంగాణలో దొరలపాలనను సాగనంపి.. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం అని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం అని వ్యాఖ్యనించారు. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందన్నారు. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్.. మేం ఎక్కడ బీజేపీ తో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోందని అన్నారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై కేసులు పెట్టారని రాహుల్ తెలిపారు. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు..ఇల్లు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ.. కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరని రాహుల్ వ్యాఖ్యనించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయం అంటూ ధీమ వ్యక్తం చేశారు.
ఆనంతరం ఆర్మూర్ వెళ్లే దారిలో పడగల్ వద్ద ఆగి ఓ టీ కొట్టు వద్ద రాహుల్ గాంధీ టీ తాగారు. ఈ క్రమంలోనే టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీకొట్టు యజమాని కుటుంబంలోని చిన్నారులతో సరదాగా సంభాషించారు. రాహుల్ గాంధీని చూసి..సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్ ను ఆప్యాయంగా పలకరించారు వృద్ధ దంపతులు.