మెకానిక్ రాహుల్ గాంధీ.. బైక్ రిపేర్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ఆకస్మికంగా ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ప్రత్యక్షమయ్యారు. సాధారణ పౌరుడి మాదిరి అక్కడివారితో కలిసిపోయారు. అక్కడ సైకిల్ వ్యాపారులు, తయారీదారులను కలిసి వారితో ముచ్చటించారు. ఓ బైక్ షాప్ కు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి కార్మికుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అక్కడున్న ఓ బైక్ ను రిపేర్ చేశారు. బైక్ ను ఎలా రిపేర్ చేయాలో మెకానిక్ ను అడిగి టెక్నిక్ నేర్చుకున్నారు.

New Update
మెకానిక్ రాహుల్ గాంధీ.. బైక్ రిపేర్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆపార్టీలో జోరు కనిపిస్తోంది. తెలంగాణతోపాటు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. అంతేకాదు ఆ ప్రణాళికలను పక్కగా అమలు చేసేందుకు అవసరమైన సంప్రదింపులు కూడా జరుపుతోంది.

rahul gandhi

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రంగంలో దిగారు. భారత్ జోడో యాత్రతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న రాహుల్...మంగళవారం ఆకస్మాత్తుగా ఢిల్లీలో పర్యటించారు. ఒక సాధారణ పౌరుడి మాదిరిగా కరోల్ బాగ్ కు వెళ్లారు. అక్కడ ఓ బైక్ మెకానిక్ షాన్ సందర్శించి...అక్కడి కార్మికుల కష్టసుఖాలను పంచుకున్నారు. అలాగే అక్కడ వాహనాలకు సంబంధించి సమాచారాన్ని కూడా తెలుసుకుని వాటిని ఎలా రిపేర్ చేయాలో టెక్నిక్ లను అడిగి తెలుసుకున్నారు.

బైక్ రిపే్ చేసే సమయంలో కార్మికులు వినియోగించే స్టూల్ పై కూర్చుండి వారితో మాట్లాడారు. తాను కూడా ఓ స్క్రూడ్రైవర్ పట్టుకుని బైక్ కు నట్లను బిగించారు. ఆ తర్వాత మరో షాక్ కు వెళ్లారు. అక్కడ తయారయ్యే పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40నిమిషాల పాటు అక్కడ గడిపారు. అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ కూడా చూశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. రాహుల్ గాంధీ బైక్ రిపేర్ చేస్తున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసింది. "ఈ చేతులు భారతదేశాన్ని తయారు చేస్తాయి" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ బట్టలపై ఉన్న మసి మన గర్వం. అలాంటి చేతలను ప్రోత్సహించే పని ఒక ప్రజానాయకుడు మాత్రమే చేస్తాడంటూ రాసుకొచ్చారు.

భారత్ జోడో యాత్ర నుండి రాహుల్ గాంధీ తరచుగా సాధారణ ప్రజలను కలుసుకోవడం వారితో మాట్లాడటం చూశాము. అంతకుముందు, రాహుల్ గాంధీ ట్రక్ డ్రైవర్లను కలుసుకున్నాడు. ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ట్రక్కులో ప్రయాణించాడు. కర్ణాటక ఎన్నికల సమయంలో, రాహుల్ బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విధంగా రాహుల్ గాంధీ ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కారణంగా జూన్ 29న రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించునున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు అక్కడి క్యాంపులకు వెళ్లి ప్రజాప్రతినిధులతో సమావేశమై పరిస్థితిపై చర్చించనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు