Rahul Gandhi: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?

దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు రాహుల్‌గాంధీ. కాటారంలో పర్యటిస్తున్న రాహుల్.. కేసీఆర్‌, కేటీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను బీజేపీ భయపెడుతుందన్నారు. కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు

Rahul Gandhi: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?
New Update

కేసీఆర్‌, కేటీఆర్‌పై రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. కాటారంలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ఫైర్‌ అయ్యారు. అటు బీజేపీపైనా తనదైన శైలీలో మండిపడ్డారు రాహుల్‌ గాంధీ. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను బీజేపీ భయపెడుతుందన్నారు. కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ ఇంకా అన్నారంటే?

➼ తెలంగాణ సమాజం ప్రజా తెలంగాణను కోరుకుంది

➼ కానీ తెలంగాణ కేవలం ఒక కుటుంబం చేతిలో బందీ అయింది

➼ BRS, బీజేపీ, ఎంఐఎం కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి.

➼ సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను భయపెడుతున్న బీజేపీ...

➼ నేను బీజేపీ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే. నాపై కేసులు పెట్టారు.

➼ నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు..

➼ కేసీఆర్ నిజంగా బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడితే.. ఆయనపై ఎందుకు ఈడీ, సీబీఐ కేసులుండవు

➼ బీజేపీ, బీఆరెస్ ఒక్కటే

➼ ఎంఐఎం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలేదు...

➼ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోంది.

➼ ఎంఐఎం ఎక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలో బీజేపీనే నిర్ణయిస్తోంది

➼ బీజేపీ బీఆరెస్ కు, బీఆరెస్ బీజేపీ కి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.

➼ దేశంలో కులగణన చేపట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం

➼ కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిది..

➼ కులగణనతోనే దేశంలో వివిధ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి.

➼ దేశంలోని అధికారుల్లో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆధులికారులున్నారని పార్లమెంట్ లో ప్రశ్నించా

➼ కేవలం 5శాతం మంది ఆ వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారు.

కులగణనపై  రాహుల్ వ్యాఖ్యలు:

దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలన్నారు రాహుల్ గాంధీ. ఆదానీ లక్షలాది కోట్లు తీసుకుని.. ఆయన అడగకముందే మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఒక రైతు రుణాన్ని , కార్మికుల అప్పును, స్వయం ఉపాది లోన్లు మాఫీ చేయరంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కుల గణన చేపట్టి దేశ సంపదను అన్ని వర్గాల వారికి అందేలా చూడాలని  చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్నాటక లో ఇచ్చిన హామీలను అమలు చేశామని..  తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రాహుల్.

Also Read: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..

#rahul-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe