Rahul Gandhi: వయనాడ్‌ ఘటనపై రాహుల్ గాంధీ కీలక నిర్ణయం

రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్‌లో 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటన చేశారు. ఈరోజు స్థానిక అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఎంతమంది మృతి చెందారు? ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయన్నది వాళ్లు తనకు వివరించారని తెలిపారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు
New Update

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్‌లో 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటన చేశారు. నిన్నటి నుంచి వయనాడ్‌లోనే ఉన్నానని.. ఇది చాలా భయంకరమైన విషాదం అని అన్నారు. ఇవాళ స్థానిక అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఎంతమంది మృతి చెందారు? ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయన్నది వాళ్లు వివరించారని తెలిపారు. నివాసం కోల్పోయిన వారికి 100 ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పార్లమెంట్‌ వేదికగా లేవనెత్తుతాం అని చెప్పారు.

రాహుల్ సంచలన ట్వీట్..

రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. తనపై ఈడీ దాడులు జరగొచ్చని అని ట్వీట్ చేశారు. ఓ అధికారి నుంచి తనకు దానిపై సమాచారం వచ్చిందని చెప్పారు. జులై 29న తాను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్‌ కొందరికి నచ్చలేదని.. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచేస్తున్నాని అని X లో పోస్ట్ చేశారు. ఈడీ రైడ్స్ ఎదురుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి రాహుల్ చెప్పినట్లు ఆయనపై ఈడీ దాడులు జరుగుతాయా లేదా అని వేచి చూడాలి.

#rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe