ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఉండేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ కాంగ్రెస్ నేతలతో ముచ్చటించిన సందర్భంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అగ్రనేత, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని..దీనికి తమ పార్టీ కూడా కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో ప్రియాంకగాంధీ పర్యటిస్తారని చెప్పారు రాహుల్ గాంధీ. ఆదివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన జన గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

publive-image

అనంతరం రాత్రి 10.20 నిమిషాలకు రోడ్డు మార్గానా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ ఏపీకిచెందిన కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, నరహరశెట్టి నరసింహరావు, జెడీ శీలం, సుంకర పద్మశ్రీ,తోపాటు పలువురు ముఖ్య నేతలు రాహుల్ తో మంతనాలు జరిపారు. ఏపీ రాజకీయాలపై కాసేపు చర్చించారు. అమరావతి రాజధాని ఉండేందుకు భూములు ఇచ్చి రూతులు పడుతున్న ఘోసను వారు రాహుల్ కు వివరించారు. అమరావతి రైతులను వైసీపీ సర్కార్ మోసం చేసిందని...తీవ్రంగా వేధిస్తుందని రాహుల్ కు చెప్పారు. నాయకులు చెప్పిన విషయాలన్నీ తనకు తెలుసన్న రాహుల్...పోలవరం ప్రాజెక్ట్ పనులు, విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం..ఇలాంటి అంశాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని నేతలు రాహుల్ ద్రుష్టికి తీసుకెళ్లారు.

ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్రతిఒక్క హోదాను నెరవేరస్తాని భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాహుల్ తో భేటీ అనంతరం పీసీపీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు