దేశానికి అగ్రదేశాధినేతలు రాక...విదేశాలకు వెళ్తోన్న రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడ యూరోపియన్ యూనియన్ లాయర్లు, విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

దేశానికి అగ్రదేశాధినేతలు రాక...విదేశాలకు వెళ్తోన్న రాహుల్ గాంధీ..!!
New Update

Rahul Gandhi's Europe Tour: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో యూరప్‌లో పర్యటించి, బెల్జియంలోని యూరోపియన్ కమిషన్ ఎంపీలతో పాటు పారిస్‌లోని యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.రాహుల్ పర్యటన దాదాపు వారం రోజులపాటు సాగనుంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9 నుండి 10 వరకు దేశ రాజధానిలో ముఖ్యమైన G20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న తరుణంలో ఆయన విదేశీ పర్యటన రావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి..

ప్రస్తుతం భారత్ జి20 అధ్యక్ష పదవిలో ఉంది. ఐదు రోజుల పర్యటన కోసం గాంధీ కుటుంబం సెప్టెంబర్ మొదటి వారంలో పారిస్ వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 7న బ్రస్సెల్స్‌లో ఈయూ సభ్యులతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ సెప్టెంబర్ 8 న పారిస్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఉపన్యాసం చేస్తారు. సెప్టెంబరు 9న పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ కార్మిక సంఘం సమావేశానికి కూడా హాజరుకానున్నారు. తదనంతరం, గాంధీ నార్వేను సందర్శించనున్నారు, అక్కడ సెప్టెంబర్ 10 న భారతీయ ప్రవాసుల కార్యక్రమంలో ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ ఎన్నారైలను కలుస్తారని, విలేకరుల సమావేశం కూడా నిర్వహించవచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

రాహుల్ యూరప్ షెడ్యూల్‌ ఇదే..

-సంబంధిత వర్గాల ప్రకారం.. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 3న యూరప్ వెళ్లనున్నారు.

-సెప్టెంబరు 7న బ్రస్సెల్స్‌లో ఈయూ న్యాయవాదుల బృందంతో భేటీ అవుతారు. హేగ్‌లో కూడా సమావేశం కానున్నారు.

-సెప్టెంబర్ 8, 9 తేదీల్లో పారిస్ లో పర్యటిస్తారు.

-సెప్టెంబర్ 8 న పారిస్‌లోని పియరీ అండ్ మేరీ క్యూరీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

- సెప్టెంబర్ 9న పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ కార్మిక సంఘం సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని అక్కడి నుంచి నార్వేకు వెళ్తారు.

- సెప్టెంబర్ 10న రాహుల్ ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది.

-సెప్టెంబర్ 11న నార్వేలోని ప్రవాస భారతీయులతో రాహుల్ సంభాషించనున్నారు.

-ఇక సెప్టెంబర్ 14న రాహుల్ భారత్‌కు తిరిగి వస్తారు.

#rahul-gandhis-europe-tour
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe