Rahul gandhi: అబద్ధాలాడి చరిత్రను చెరపలేరు.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్!

కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య తేడాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అబద్ధాలాడి చరిత్రను చెరపలేరంటూ విమర్శలు చేశారు.

Rahul gandhi: అబద్ధాలాడి చరిత్రను చెరపలేరు.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్!
New Update

Delhi: కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య తేడాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ లొసుగులను ఎత్తి చూపుతున్న రాహుల్.. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరుగా పేర్కొన్నారు.

చరిత్రను చెరపలేరు..

ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ పరిశీలిస్తే.. 'భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు ఉన్నారు. దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం ఎవరు పోరాడారో చరిత్రే సాక్ష్యం. 'క్విట్ ఇండియా ఉద్యమం' సమయంలో బ్రిటీష్ వారికి ఎవరు అండగా నిలిచారు? భారతదేశ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు, దేశాన్ని విభజించే శక్తులతో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు?' అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ వేదికల నుంచి అబద్ధాలు చెప్పినంత మాత్రానా చరిత్రను చెరపలేరంటూ తనదైన స్టైల్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

#criticized-on-bjp #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe