/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Raghu-Rama-Raju.jpg)
Raghurama Raju: ఒక్కోసారి కొన్ని సన్నివేశాలు పెను సంచలనం సృష్టిస్తాయి. సరిగ్గా అదే జరిగింది ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో. రాజకీయాల్లో ఉప్పూ.. నిప్పూలా ఉంటూ కారాలు.. మిరియాలు నూరుకునే ఇద్దరు అసెంబ్లీలో ఎదురుపడ్డారు. దాంతో మొత్తం ఎమ్మెల్యేల కళ్లన్నీ వారిపైనే. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే రఘురామరాజు ఈ ఇద్దరి గురించి ఏపీలో చిన్న పిల్లవాడిని అడిగినా తడుముకోకుండా వారి మధ్య ఉండే శత్రుత్వం గురించి కథలుగా చెప్పేస్తారు. అటువంటి ఇద్దరూ అసెంబ్లీలో ఒకేసారి ఉంటే ఏమవుతుంది అనే ఆసక్తి అందరికీ ఇప్పటివరకూ ఉంది.
Raghurama Raju: సరిగ్గా సభ ప్రారంభానికి కాస్త ముందుగా జగన్ దగ్గరకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వెళ్లారు. ఆయనను పలకరించి మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ నడిచింది. దీంతో అసెంబ్లీలో ఉన్నవారందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఉత్కంఠగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు జగన్ చెవిలో ఎదో చెప్పడం కనిపించింది. ఆ వెంటనే జంగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది. దీంతో ప్రస్తుతం అందరి మధ్య ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది.
Raghurama Raju: వైసీపీ లో ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణరాజు. తరువాత జగన్ తో విబేధించి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇది చివరికి పెద్ద వివాదంగా మారింది. రఘురామ కృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. చంపేందుకు చూశారని అప్పట్లో రఘురామ కృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. 2024 ఎన్నికల్లో రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన జగన్మోహన్ రెడ్డి, సీఐడీ అధికారులు తనపై అప్పట్లో హత్యాయత్నం చేశారని గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో జగన్.. రఘురామల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.
Raghurama Raju: నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో రఘురామ-జగన్ మధ్య జరిగిన ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఏకంగా జగన్ దగ్గరకు వెళ్లిమరీ.. రఘురామ ఆయన చెవిలో వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విబేధాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత వేడిని రాజేసిందని చెప్పవచ్చు. భవిష్యత్ లో ఏపీ అసెంబ్లీలో ఇంకెన్ని విచిత్ర సంఘటనలను చూపిస్తుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.
Also Read : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు