చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..గవర్నర్ కు ఎంపీ లేఖ..!!

చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు జైల్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..

New Update
చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..గవర్నర్ కు ఎంపీ లేఖ..!!

Raghurama Krishnam Raju: చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnam Raju) లేఖ రాశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే  విధంగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గుతే  కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని…జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అటు జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. మెరుగైన వైద్యం కోసం చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!!

Advertisment
తాజా కథనాలు