Ananth Ambani: రాధిక డ్రెస్ లో అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖ.. ఫొటో వైరల్

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో రాధిక మర్చంట్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ చాలా ప్రత్యేకంగా కనిపిపించింది. అనంత్ అంబానీ రాసిన ప్రేమలేఖను రాధికా ఆమె డ్రెస్ పై అందంగా డిజైన్ చేయించారు.

New Update
Ananth Ambani: రాధిక డ్రెస్ లో అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖ.. ఫొటో వైరల్

Ananth Ambani: జామ్‌నగర్‌లో మూడు రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ తర్వాత, ఇటీవలే అనంత్ , రాధికా అంబానీల సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు లగ్జరీ క్రూయిజ్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ లగ్జరీ క్రూయిజ్ లో మే 30న ఇటలీలో ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిశాయి. దాదాపు 300 పైగా VIPలు, బాలీవుడ్ స్టార్స్ ఈ క్రూయిజ్ వేడుకల్లో సందడి చేశారు.

publive-image

సెకండ్ ప్రీ వెడ్డింగ్

అయితే తాజాగా అనంత్, రాధికా సెకండ్ ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. 4 రోజుల పాటు సాగిన క్రూయిజ్ పార్టీలో రాధిక మర్చంట్ ప్రతి లుక్ ఫోటోలో చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఇందులో రాధికా ధరించిన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కు చాలా ప్రత్యేకత ఉంది. అంతే కాదు రాధికా ఈ డ్రెస్ ను తన పిల్లలు, మనవళ్ల కోసం కూడా సురక్షితంగా ఉంచాలనుకుంటోదట. అసలు ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..

publive-image

బ్లాక్ అండ్ వైట్ గౌన్ స్పెషాలిటీ

ఈ బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్‌పై అనంత్ అంబానీ రాసిన ప్రేమలేఖను ముద్రించారు. రాధికా మర్చంట్ 22వ పుట్టినరోజు సందర్భంగా అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖను రాధికా తన డ్రెస్ పై అందంగా డిజైన్ చేయించుకున్నారు. ఈ స్పెషల్ డిజైనర్ గౌను ను డిజైనర్ రాబర్ట్ వున్ డిజైన్ చేశారు. ఈ లుక్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

publive-image

publive-image

Also Read: Ambani Pre Wedding: అనంత్ అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. గెస్టులకు ఆ కండీషన్..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు