US shooting: అమెరికాలో జాత్యాహంకార దాడి...ఫ్లోరిడాలో ముగ్గురు నల్లజాతీయులు మృతి..!!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లెలో ఉన్న డాలర్ జనరల్ స్టోర్ దగ్గర ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మరణించారు. 20ఏళ్ల వయస్సున్న యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. నల్లజాతీయులే లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

New Update
US shooting: అమెరికాలో జాత్యాహంకార దాడి...ఫ్లోరిడాలో ముగ్గురు నల్లజాతీయులు మృతి..!!

US shooting  ; అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో జాతి వివక్షకు గురైన ఓ వ్యక్తి ముగ్గురిని కాల్చిచంపాడు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి 20 ఏళ్ల వయసున్న శ్వేతజాతీయుడని అధికారులు తెలిపారు. జాక్సన్‌విల్లే షెరీఫ్ TK వాటర్స్ మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తి AR-శైలి రైఫిల్, హ్యాండ్‌గన్‌తో ఆయుధాలు కలిగి ఉన్నాడని తెలిపారు.

నల్లజాతీయులపై దుండగుడు జరిపిన దాడి జాతి వివక్షతో కూడుకున్నదన్నారు. అతను లక్ష్యంగా చేసుకున్న సమూహంలో నల్లజాతీయులందరూ ఉన్నారు. డాలర్ జనరల్ డిస్కౌంట్ స్టోర్ లోపల షూటింగ్ చేస్తున్నప్పుడు, అతను చంపాలనుకుంటున్నాడని అధికారులు తెలిపారు. వార్తా సంస్థ AFP ప్రకారం, FBI కాల్పులను ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తుందని తెలిపింది.

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకునేలోపు దుండగుడు స్టోర్ కి వెళ్లాడు. కాల్పులు సమయంలో దుండగుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించాడు. జాత్యాహంకారంతోనే దుండగుడు వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారన్నది వెల్లడించలేదు.

అటు రెండు రోజుల క్రితం దక్షిణ కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని ట్రబుకో కాన్యన్‌లో జరిగిన కాల్పుల్లో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బైకర్ బార్ అనే ప్రదేశంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైకర్ బార్ మోటార్‌సైకిల్ రైడర్‌లకు వినోద కేంద్రంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరెంజ్ కౌంటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కూడా దుండగుడు కాల్పులు జరపడంతో…పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ గా పోలీసులు గుర్తించారు. అతను తనకు తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పుల జరిపినట్లు అనుమానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు