Rabri Sweet : పాలతో చేసే స్వీట్ ఇష్టం లేదా.. కొబ్బరితో ట్రై చేయండి రాబ్డీ ఒక రాయల్, చాలా రుచికరమైన స్వీట్. కొబ్బరి రాబ్డీలో ఉండే కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి రాబ్డీతో ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెల్లండి. By Vijaya Nimma 16 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Do You Like Rabri Sweet : రాబ్డీ(Rabri Sweet) ఒక రాయల్, చాలా రుచికరమైన స్వీట్. కానీ కొంతమందికి పాలు ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసం కోకోనట్ రబ్డీ(Coconut Rabri) వంటకాన్ని చేసుకోవచ్చు. పండుగ స్వీట్ డిష్ కోసం మిల్క్ రబ్రీకి బదులుగా కొబ్బరి రబ్రీని ప్రయత్నించవచ్చు. కొబ్బరి రాబ్డీలో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రబ్డీ ఒక ప్రత్యేక స్వీట్ అయితే దీనిని గులాబ్ జామూన్, మల్పువా, పూరీ, జలేబీతో కలిపి తింటారు. కొబ్బరి రాబ్డీకి కావలసినవి: లీటరు ఫుల్ క్రీమ్ పాలు 1/2 కప్పు తురిమిన కొబ్బరి 1/2 కప్పు ఖోయా చక్కెర జీడిపప్పు, ఏలకులు తరిగిన బాదం, పిస్తా 10 కేసరి దారాలు గులాబీ రేకులు కొబ్బరి రాబ్డీ తయారీ విధానం: ఒక చిన్న గిన్నెలో 10-15 జీడిపప్పులను తీసుకుని వేడి నీటిలో నానబెట్టాలి. తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టాలి. పాన్ తీసుకుని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్(Full Cream Milk) వేయండి. అది మరిగే వరకు వేడి చేస్తూ ఉండండి. మంటను తగ్గించి, పాలు 3/4 పరిమాణానికి తగ్గే వరకు ఉడికించాలి. పాన్‌కు అంటుకోకుండా నిరంతరం తిప్పుతూ ఉండాలి. పాలలో కేసరి దారాలు, ఖోయా వేయాలి. కొన్ని నిమిషాల తర్వాత ఒక మిక్సర్ తీసుకుని నానబెట్టిన జీడిపప్పును మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో పంచదార, తురిమిన కొబ్బరిని కలపండి. పాలు గట్టిగా మారేవరకు కలపాలి. అందులో జీడిపప్పు పేస్ట్(Cashew Paste) వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత చల్లార్చుకోవాలి. గులాబీ రేకులు వేసి దించుకోవాలి. ఇది కూడా చదవండి: యూత్‌లా కనిపించాలంటే కొబ్బరినూనెతో ఇలా చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #tasty #rabri-sweet #coconut-rabri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి