Raashi khanna: ఎంత ముద్దుగా ఉందో.. మేకప్ లేని రాశిఖన్నాను చూస్తే ఫ్లాట్ అవుతారు ప్రముఖ తెలుగు హీరోయిన్ రాశీఖన్నా తాజాగా సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఫేస్ గ్లోగా, అందంగా కనిపించడానికి ఇంట్లోనే పాటించే అద్భుతమైన చిట్కాను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. By Archana 22 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Raashi khanna: టాలీవుడ్ ప్రముఖ నటి రాశీ కన్నా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాశీ కన్నా అవసరాల శ్రీనివాస్ తొలి సారి దర్శకత్వం వహించిన ఊహలు గుస గుస లాడే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలో రాశీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాశీ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్ఠీఆర్, రవితేజ, విజయ్ దేవర కొండ, రామ్ పలు స్టార్ హీరోల సరసన నటించింది. రాశీ నటించిన జై లవకుశ, సుప్రీం, ప్రతిరోజు పండగ, తొలి ప్రేమ తన కెరియర్ లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ.. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఫేస్ అందంగా కనిపించాలంటే కేవలం బ్యూటీ ప్రాడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు.. ఇంట్లోనే ఇలాంటి టిప్స్ పాటిస్తే ఫేస్ గ్లోగా కనిపిస్తుందని.. చేసి మరీ చూపించింది. ఈ వీడియోలో రాశీ ఇంట్లోనే బ్యూటీ టిప్స్ ఎలా పాటించాలో చెప్పారు. ఒక బౌల్ లో ఐస్ వాటర్ తీసుకొని.. కాసేపు మొహాన్ని ఆ చల్లటి నీటిలో ఉంచి.. ఆ తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేస్తే.. ఫేస్ పై ఉన్న డెడ్ సెల్స్ పోవడంతో పాటు స్కిన్ గ్లోయింగ్ గా కనిపిస్తుందని అభిమానులతో మంచి బ్యూటీ టిప్స్ షేర్ చేసుకున్నారు రాశీ. ఈ వీడియోను చూసిన రాశీ ఫ్యాన్స్ 'సో బ్యూటీఫుల్' అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Mahesh babu Guntur Karam: లీకైన గుంటూరు కారం సాంగ్ షూట్.. మహేష్ స్టెప్పులు సూపర్.. ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) #raashi-kanna #raashi-kanna-beauty-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి