Ayodhya : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి!

రామ మందిరంపై న్యాయ పోరాటం ఎంతకాలం కొనసాగింది? రామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారు? మందిర నిర్మాణానికి ఏ రాయిని ఉపయోగించారు..? ఎవరు డిజైన్‌ చేశారు? అయోధ్య గురించి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Ayodhya : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి!

Questions on Ayodhya for Competitive Exams : జనవరి 22 చుట్టూనే దేశమంతా తిరుగుతోంది. అయోధ్య(Ayodhya) రాముడి ప్రాణ ప్రతిష్ఠ(Prana Pratishtha) ముగిసి ఒక రోజు గడిచిన తర్వాత కూడా ఇంకా ఆ బాలరాముడి దివ్య రూపం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అయోధ్యలో రామమందిరపు(Ram Mandir) మహా సంప్రోక్షణ చుట్టూనే ఇంటర్‌నెట్‌(Internet)లో చర్చ నడుస్తోంది. దీని గురించి అనేక ప్రశ్నలు మెదడులో తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి అయోధ్య గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షల్లో రామ మందిరంపై క్వశ్చన్స్‌ ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్(GK) విభాగంలో భాగం అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ పరీక్షల్లో అడిగే కొన్ని ప్రశ్నలపై ఓ లుక్కేద్దాం.

Also Read : Hyderabad: ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరేసుకున్న అక్కాతమ్ముడు!

రామ మందిరంపై న్యాయ పోరాటం ఎంతకాలం కొనసాగింది?
అలహాబాద్ హైకోర్టులో 23 సంవత్సరాలు, ఫైజాబాద్ జిల్లా కోర్టులో 102 సంవత్సరాలు.. మొత్తంగా రామ మందిరం వ్యవహారం 134 సంవత్సరాలు కొనసాగింది.

రామమందిరంపై తుది తీర్పునిచ్చిన న్యాయమూర్తుల పేర్లు?

మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్(Ranjan Gogoi), జస్టిస్ SA బోబ్డే, ప్రస్తుత CJI DY చంద్రచూడ్, మాజీ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తీర్పును వెలువరించారు.

రామ మందిరాన్ని ఎవరు రూపొందించారు? దాని నిర్మాణానికి ఏ సంస్థ సహకరించింది?
చంద్రకాంత్ సోంపురా, కుమారుడు ఆశిష్ సోంపురా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ & టూబ్రో(L&T) ఆలయ నిర్మాణానికి సహకరించింది.

రాముడి విగ్రహ శిల్పి ఎవరు?

కర్నాటకలోని మైసూర్ నివాసి అరుణ్ యోగిరాజ్(Arun Yogi Raj), శ్రీరామ విగ్రహ శిల్పి.

రామ మందిరం ఏ శైలిలో నిర్మించబడింది?

రామ మందిరం నాగరా శైలిలో నిర్మించబడింది.

ఏ రాయిని ఉపయోగించారు.. డిజైన్‌ను ఎవరు సిద్ధం చేశారు?

రాజస్థాన్‌కు చెందిన మక్రానా రాయిని ఉపయోగించారు. డిజైన్‌ను చంద్రకాంత్ సోంపురా, ఆయన కుమారుడు రూపొందించారు.

Also Read: సోషల్‌ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్‌!

WATCH:

Advertisment
తాజా కథనాలు