AP : కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే?

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గాయపడిన కొండచిలువ మృతి చెందింది. కొండచిలువపై వాహనం దూసుకువెళ్లగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు.

New Update
AP :  కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే?

Kakinada : కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొండచిలువ (Python) మృతి చెందింది. ఏలేశ్వరం పరిధిలోని ప్రధాన రహదారి దాటుతుండగా కొండచిలువపై నుంచి వాహనం దూసుకెళ్లింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ (Forest Department) సిబ్బంది కొండచిలువను ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు.

Also Read: హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..!

పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ బాలచంద్ర యోగీశ్వర్, పశు వైద్యాధికారి సతీష్ కుమార్ కొండచిలువకు శస్త్రచికిత్స నిర్వహించారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram) లో మూడు రోజులపాటు కొండచిలువను పరిశీలనలో ఉంచేందుకు పంపారు అధికారులు. అయితే, అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు.

Advertisment
తాజా కథనాలు