Bumper Offer: రూ. 699తో మల్టీప్లెక్స్ థియేటర్‌లో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు.. కండీషన్స్ అప్లై..

ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు PVR ఐనాక్స్ అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా భారీ నెట్‌వర్క్ కలిగిన ఉన్న PVR ఐనాక్స్ సంస్థ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా ఇన్-థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా మీరు థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

Bumper Offer: రూ. 699తో మల్టీప్లెక్స్ థియేటర్‌లో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు.. కండీషన్స్ అప్లై..
New Update

PVR INOX Multiplex Monthly Subscription Pass: గతంలో ఏదైనా సినిమా(Cinema) విడుదల అవుతుందంటే చాలు.. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా థియేటర్‌కు(Movie Theatre) వెళ్లి సినిమా చూసి వచ్చేశారు. జస్ట్ వంద రూపాయాల్లో ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌లుగా మారిపోయాయి థియేటర్లు. ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. సినిమా టికెట్ల రేట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక వ్యక్తి సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే.. కనీసం రూ. 500 చేతిలో ఉండాల్సిందే. ఇక ఫ్యామిలీతో వెళ్తే రూ. 3 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. అందుకే.. చాలా మంది ఇంత డబ్బు పెట్టి సినిమా చూడాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంట్లోనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో చూస్తుంటారు. ఫలితంగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

ఈ నేపథ్యంలోనే.. ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు PVR ఐనాక్స్ అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా భారీ నెట్‌వర్క్ కలిగిన ఉన్న PVR ఐనాక్స్ సంస్థ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా ఇన్-థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా మీరు థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారు నెలకు రూ.699 చెల్లించి నెల మొత్తం థియేటర్లలో సినిమాలను చూడవచ్చు. ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్‌కి రప్పించేందుకు ఈ ఆఫర్‌ను ఇస్తోంది పీవీఆర్. ఈ సబ్‌స్క్రిప్షన్ పాస్ అక్టోబర్ 16 నుండి అమలులోకి వస్తుంది.

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

అయితే ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ తీసుకున్న వారికి INOX గవర్నింగ్ బాడీ కొన్ని షరతులు విధించింది. ఈ పాస్‌తో నెలలో 10 సినిమాలు మాత్రమే చూడటానికి ఆస్కారం ఉంది. ఈ పాస్ ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది. పాస్ తీసుకున్న వ్యక్తికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ పాస్ వేరొకరికి ఇచ్చి థియేటర్‌కి పంపడం సాధ్యం కాదు. అంతేకాకుండా, ఈ పాస్ సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ తీసుకోవాలనుకునే వారు పీవీఆర్ ఐనాక్స్ యాప్ లేదా వెబ్‌సైట్ నుండి పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

#movies #theatre #bumper-offer #pvr-inox-bumper-offer #pvr-inox-pass #multiplex-monthly-subscription-pass
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe