PV Ramesh Resigns to MEIL: మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ (CID) తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుపై సీఐడీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. అయితే, మేఘా సంస్థ తనను రాజీనామా చేయాలని కోరిందని, ఆ కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగతోంది. దాంతో ఈ పోస్టులపై పీవీ రమేష్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారాయన.
ఇదిలాఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పీవీ రమేష్ ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. పీవీ రమేష్ స్టేట్‌మెంట్ వల్లే కేసు కీలక మలుపు తిరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై చర్యలకు ఉపక్రమించారనే టాక్. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని పీవీ రమేష్ తప్పు పట్టడంతో మరింత చర్చనీయాంశమైంది. మరి ఈ వ్యవహారం ఎటువరకు వెళ్తుందో చూడాలి.
Also read:
Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..
Nandamuri Balakrishna : ఎన్ని కేసులు పెట్టినా సరే.. తగ్గేదేలే.. వైసీపీపై బాలయ్య మాస్ కామెంట్స్..