PV Ramesh: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా.. బలవంతంగా పంపించారా? మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. By Shiva.K 12 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి PV Ramesh Resigns to MEIL: మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ (CID) తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుపై సీఐడీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. అయితే, మేఘా సంస్థ తనను రాజీనామా చేయాలని కోరిందని, ఆ కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగతోంది. దాంతో ఈ పోస్టులపై పీవీ రమేష్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారాయన. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం కరెక్టు కాదని పీవీ రమేష్ అన్న మాటలు సిఐడి కేసులో గాలిని తీసేశాయి. అందుకే హైదరాబాద్ లో దిగీదిగగానే జగన్ నుంచి… pic.twitter.com/iodn15sqIZ — Ramesh Kandula (@iamkandula) September 12, 2023 ఇదిలాఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పీవీ రమేష్ ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. పీవీ రమేష్ స్టేట్‌మెంట్ వల్లే కేసు కీలక మలుపు తిరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై చర్యలకు ఉపక్రమించారనే టాక్. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని పీవీ రమేష్ తప్పు పట్టడంతో మరింత చర్చనీయాంశమైంది. మరి ఈ వ్యవహారం ఎటువరకు వెళ్తుందో చూడాలి. Also read: Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. Nandamuri Balakrishna : ఎన్ని కేసులు పెట్టినా సరే.. తగ్గేదేలే.. వైసీపీపై బాలయ్య మాస్ కామెంట్స్.. #andhra-pradesh #chandrababu-arrest #meil #pv-ramesh #pv-ramesh-resigned #pv-ramesh-resigns-to-meil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి