YCP: వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తా.!

పుట్టపర్తి వైసీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేదే లేదని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అతడికి టికెట్ ఇస్తే రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పారు.

New Update
YCP: వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తా.!

Anathapuram YCP Politics: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వైసీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనకే  టికెట్ వస్తుందని ధీమ వ్యక్తం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని.. అయితే, ఆయనకు అధిష్టానం టికెట్ ఇస్తే పుట్టపర్తిలో వైసీపీ గెలిచే ఛాన్సే లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!

ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదు..
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను ఆయన ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 20 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలను కూడా పక్కనపెట్టి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు.


Also Read: వాహనదారులకు షాక్.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!

ఆయనకు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తా..
ఎమ్మెల్యే కార్పొరేట్ రాజకీయాలు నడపడం వల్ల వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం నెలకొందన్నారు. ఆయన మూలంగా చాలా మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు పార్టీని వీడుతున్నారని దుయ్యబట్టారు. చాలా సర్వేల్లో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గెలిచే అవకాశం లేదని తేలిందన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాను పార్టీకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పుట్టపర్తిలోని పరిస్థితిని అర్థం చేసుకొని బలమైన వ్యక్తికి టికెట్ కేటాయించేలా పార్టీ ఆలోచించాలని ఆయన కోరారు.

తారా స్థాయిలో టికెట్ల పంచాయితీ
ఇదిలా ఉంటే.. వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. పలు సీట్లలో సిట్టింగ్ లను మార్చి వేరే వారిని సమన్వయకర్తలుగా నియమించడంతో టికెట్ దక్కని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి షర్మిలకు జై కొట్టారు. వైజాగ్ కు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోయారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే అదనుగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై స్థానిక నేతలు. ఆశావహులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు